కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్తని అందించారు. త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారుసు లేఖలకు టీటీడీ అనుమతి లభించనుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కలిశారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు విఐపి బ్రేక్ దర్శనానికి వారానికి రెండు (12 టికెట్లు) సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. వారానికి రెండు సిఫారుసు లేఖల చొప్పున మూడు వందల రూపాయల దర్శనానికి ఏపీ సీఎం అనుమతిచ్చినట్లు పేర్కొన్నారు.
ఇక ఇంతకుముందు ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయగా.. ఏపీ సీఎం చంద్రబాబు దానికి బదులిచ్చారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే మీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో క్రింద పేర్కొన్న విధముగా అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇవ్వడమైనది. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మీ కోరికపై ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ప్రతి గౌరవ ఎం.ఎల్.ఏ/ఎం.ఎల్.సి/ఎం.పి నుంచి ప్రతివారము ఏదైనా రెండు రోజులలో (సోమవారం నుండి గురువారం వరకు) వి.ఐ.పి బ్రేక్ దర్శన్ (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ.300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయి. ప్రతి లేఖలో ఆరుగురు భక్తులు వరకు దర్శనమునకు సిఫారసు చేయవచ్చునని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు