పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం విజయవంతమైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి కొద్దిసేపటి క్రితం రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ మొదటి ప్రయోగవేదిక నుండి ఈ ప్రయోగ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లో అనుసంధానం చేసే ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే స్పేస్ షిప్ లను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న స్పేస్ షిప్ లను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం అవడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు