దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీదరూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా దేశంలోని సీఎంల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఆయనకు రూ. 10 కోట్ల అప్పు ఉంది. ఇక ఈ జాబితాలో కేవలం రూ.15 లక్షల ఆస్తితో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆఖరి స్థానంలో నిలిచారు. దేశంలోని 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ. 1,630 కోట్లుగా ఉంది.
టాప్-5 ధనిక సీఎంలు:
నారా చంద్రబాబు నాయుడు – ఆంధ్రప్రదేశ్ (రూ.931.83 కోట్లు)
పెమా ఖండు – అరుణాచల్ ప్రదేశ్ (రూ.332.56 కోట్లు)
సిద్దా రామయ్య – కర్ణాటక (రూ.51.93 కోట్లు)
నెపియో రియో – నాగాలాండ్ (రూ.46.95)
మోహన్ యాదవ్ – మధ్యప్రదేశ్ (రూ.42.04)
జాబితాలో ఆఖరి నుండి టాప్-5 లో నిలిచిన సీఎంలు:
మమతా బెనర్జీ – వెస్ట్ బెంగాల్ (రూ.15 లక్షలు)
ఒమర్ అబ్దుల్లా – జమ్మూ కాశ్మీర్ (రూ.55 లక్షలు)
పినరయి విజయన్ – కేరళ (రూ.1.18 కోట్లు)
అతీషీ – ఢిల్లీ (రూ.1.41 కోట్లు)
భజన్ లాల్ శర్మ – రాజస్థాన్ -(రూ. 1.46 కోట్లు).
దేశంలోని 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు: టాప్ లో చంద్రబాబు ఆఖరి స్థానంలో మమతా బెనర్జీ
By admin1 Min Read
Previous Articleతెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త
Next Article ఆ కథనాల్లో నిజం లేదు :- దీపిక పదుకొణె