త్వరలో జరగనున్న జర్మనీ ఎన్నికల్లో అక్కడి ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని వ్యాఖ్యలు చేశారు.అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఒలాఫ్ ఈ విధంగా స్పందించారు.జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్లమెంటులో విశ్వాసం కోల్పోయారు.733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరగ్గా 207 ఓట్లే ఆయనకు అనుకూలంగా వచ్చాయి.వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు.మెజారిటీకి 367 ఓట్లు అవసరం.దాంతో అక్కడ ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.ఫిబ్రవరి 23న ఈ పోలింగ్ జరగనుంది.ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్ షోల్జ్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Previous Article2024 బెస్ట్ మూవీ ఇదే.. సాయిపల్లవి సినిమాపై జాన్వీకపూర్ పోస్ట్
Next Article ‘వివాద్ సే విశ్వాస్’ పథకం గడువు పెంచుతూ కీలక నిర్ణయం

