వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను రానున్న 2025 సంవత్సరం ఫిబ్రవరి 5-9 వరకు మొదటిసారిగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ప్రకటించారు. దీనిపై ప్రముఖ నటుడు రామ్ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ, భారత ప్రభుత్వం మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం పట్ల హార్షం వ్యక్తం చేశారు.ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ సమ్మిట్, వేవ్స్ 2025, పరిశ్రమ సహకారానికి నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు.
ఇక భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సదస్సు మొత్తం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుంది.
Wonderful to see Honourable Prime Minister Shri. @narendramodi Ji and the Government of India supporting the Media & Entertainment sector.
The Film and Entertainment world summit, WAVES 2025, will be a true Game Changer for industry collaboration.
— Ram Charan (@AlwaysRamCharan) December 31, 2024