రేషన్ బియ్యం వివాదం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ విచారణ నేడు జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ తమ సొంత గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో ఏ1గా ఉన్న జయసుధకు నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పేర్ని జయసుధ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆర్ పేట సీఐ ఏసుబాబు ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచారణ కొనసాగింది.
Previous Article2025 తొలి రోజు సీఎం సహాయ నిధి కింద రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ పై తొలి సంతకం చేసిన ఏపీ సీఎం
Next Article రాజస్థాన్ బోరు బావి చిన్నారి మృతి…!