వందే భారత్ స్లీపర్ ట్రైన్ లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోలో ట్రైన్ అంత గరిష్ట వేగం లోనూ గ్లాసు లో నీరు ఒలకకుండా ఉంది.
ముందుగా జనవరి 1న రైలును కి.మీ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్ లోని కోటా నుండి లబాన్ స్టేషన్ల మధ్య 180 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. సాధారణ ప్రయాణికులకు సమమైన బరువును ఆసమయంలో రైల్లో ఉంచారు. పలు విధాలైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని నెలల్లోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్లీపర్ ట్రైన్ లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో సీటింగ్ తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025