తండ్రి నుంచే తాను లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని నటి ఖుష్బూ మరోసారి తెలిపారు. ఆయన వల్ల చిన్నతనంలోనే తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని అన్నారు.మా నాన్న వల్ల మా కుటుంబం మొత్తం వేధింపులు చూశాం. అమ్మను బాగా కొట్టేవాడు.నా సోదరులను కూడా ఆయన చితకబాదే వాడు.నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.నా పై జరుగుతున్న దాడి గురించి అమ్మకి ఎలా చెప్పాలో తెలియలేదు.రాను రాను నేను ధైర్యంగా నో చెప్పడం నేర్చుకున్నా.అది నచ్చక కొన్నిసార్లు ఆయన షూట్ కు వచ్చి కొట్టేవాడు.14 ఏళ్ల వయసులో నాపై జరుగుతున్న దాడి గురించి బయటకు చెప్పగలిగా.కొంతకాలానికి ఆయన అందరినీ వదిలి వెళ్ళిపోయారు.అప్పటి నుంచి ఆయన్ని మళ్ళీ కలవలేదు.గతేడాది చనిపోయారు అనుకుంటా అని ఖుష్బు చెప్పారు.
Previous Articleఎన్డీయే హయాంలోనే ఎక్కువ ఉద్యోగాల కల్పన: కేంద్ర మంత్రి మాండవీయ
Next Article సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టులో ఊరట