దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ఎద్దేవా చేసింది.ఈ మేరకు పాంగ్యాంగ్‌లోని కేసీఎన్‌ఏ (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) కథనం వెలువరించింది.చాలా అరుదుగా మాత్రమే దక్షిణ కొరియా విషయాలపై ఈ పత్రిక స్పందిస్తుంది.డిసెంబర్ 3వ తేదీన మార్షల్ లా తర్వాత కీలుబొమ్మ దేశమైన దక్షిణ కొరియాలో అసాధారణంగా అభిశంసనలు చోటు చేసుకొంటున్నాయి.ఇప్పటికే అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్ జారీ అయింది.అక్కడ సామాజిక,రాజకీయ గందరగోళం నెలకొందని పేర్కొంది.
దక్షిణ కొరియాలో ప్రభుత్వ వ్యవస్థలను ఉత్తర కొరియా తరచూ అమెరికా చేతిలో కీలు బొమ్మలుగా అభివర్ణిస్తుంది.డిసెంబర్ 3వ తేదీన మార్షల్ ప్రకటనపై మాత్రం ఆ దేశ పత్రికలు ఏమీ స్పందించలేదు.కిమ్ పాలనలో రాజకీయ సుస్థిరతను హైలైట్ చేసేందుకు ఈ కథనాలు,వ్యాఖ్యానాలు ప్రచురిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ యోన్ హాప్ రాసుకొచ్చింది.