భారీ లాభాలలో నిన్న దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నేల చూపులు చూశాయి. భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 720 పాయింట్ల నష్టంతో 79,223 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి 24,004 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.78గా కొనసాగుతోంది. టైటాన్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలివర్, రిలయన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.
Previous Articleమరోసారి తన దాతృత్వం చూపిన ఎలాన్ మస్క్
Next Article దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ ఎద్దేవా