నూతన సంవత్సరం వేడుకల వేళ అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రపంచం ముందు అమెరికాను నవ్వులపాలు చేశారంటూ డెమోక్రట్లపై విరుచుకుపడ్డారు.అమెరికా విఫలమైంది.ప్రపంచమంతా మనల్ని చూసి నవ్వుతోంది.సరిహద్దులు తెరిచిపెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బలహీనమైన నాయకత్వమే వీటికి కారణం.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, డెమోక్రట్ల ప్రభుత్వం, స్థానిక న్యాయవాదులు తమ విధిని సరిగా నిర్వర్తించడం లేదు.రాజకీయ ప్రత్యర్థులపై చట్ట విరుద్ధమైన దాడి చేయడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు’ అని ఆయన ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు.
Previous Articleదక్షిణ కొరియాపై ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ ఎద్దేవా
Next Article ఆప్‌పై ప్రధాని మోదీ విమర్శలు…!