గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో నిర్వహించిన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, అవయవ దాతల 5వ మహాసభ సంయుక్త కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అవయవాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయని కానీ అవయవదానం చేయడం కోసం ముందుకు వచ్చే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అపోహలు వీడి నిస్సంకోచంగా అవయవదానం చేయవచ్చని ప్రాణాలు నిలబెట్టడం కంటే గొప్ప పని ఏముంటుంది? అని అన్నారు. తల్లి జన్మనిస్తుంది.. అవయవదానం పునర్జన్మ నిలుస్తుందని పేర్కొన్నారు. ‘జీవన్ దాన్’ సంస్థ ద్వారా అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్ళు మన రాష్ట్రంలో 4,900కు పైగా ఉండగా, అవయవదానానికి అంగీకరిస్తూ గతేడాది పేర్లు నమోదు చేసుకున్నవాళ్లు 65 మంది మాత్రమేనని. అవసరమైన వాళ్ల సంఖ్యతో పోలిస్తే దానానికి ముందుకొచ్చిన వాళ్ల సంఖ్య 1 శాతం కూడా లేదని పేర్కొన్నారు. అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరగాలి. బ్రెయిన్ డెడ్, సహజ మరణం, ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరైన వైద్య, నర్సింగ్ విద్యార్థులు అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమంలో ప్రాణాలు నిలబెట్టే క్రతువులో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజలు కూడా అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అవయదానానికి అంగీకరించేలా చేస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన, నిలబెడుతున్న అవయవదాతల సంఘానికి ఈసందర్భంగా అభినందనలు తెలిపారు. అవయవదానం శస్త్రచికిత్సలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలవడానికి కారణమైన పద్మశ్రీ డాక్టర్ ఆళ్ళ గోపాల కృష్ణ గోఖలే కు “సావిత్రీ బాయి ఫూలే జీవిత సాఫల్య పురస్కారం” అందించారు. పలువురు అవయవదాతలు, అవయవ దాతల కుటుంబ సభ్యులు, సంఘాలకు పురస్కారాలు, కార్డులు అందించి సత్కరించారు. అవయవదాతల సంఘం క్యాలెండర్ ను, డైరీని ఆవిష్కరించారు.
సావిత్రీ బాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక విప్లవకారిణి, సంఘ సంస్కర్త, రచయిత్రి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు