మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు.ఈ ఘటనలో కంప్యూటర్లు, ఏసీలు, ప్రాజెక్టర్, కుర్చీలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటన స్టలికి చేరుకుని పరిశీలించారు.ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఈ సంఘటన జరిగినట్లు గుర్తించారు.ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో పొవాయ్‌లోని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ల్యాబ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు.కిరోసిన్ పోసి ల్యాబ్‌కు నిప్పంటించి పారిపోయాడని అధికారులు తెలిపారు.
Previous Articleగేమ్‌ఛేంజర్ టికెట్ ధరలు పెంపు….!
Next Article ప్రాణం పోయే వరకు దేశం వదలను : ఇమ్రాన్ ఖాన్