బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5 టెస్టుల సిరీస్ ను 3-1 తో ను కైవసం చేసుకుంది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటయింది. అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆట మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 141-6 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే చేసింది. జడేజా (13), వాషింగ్టన్ సుందర్ (12) స్వల్ప పురుషులకే పరిమితమయ్యారు. టెయిలండర్స్ కూడా బ్యాట్ ఝళిపించలేకపోవడంతో ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. ఇక ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉస్మాన్ ఖవాజా (41), ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), బో వెబ్ స్టర్ (39 నాటౌట్) రాణించడంతో ఆస్ట్రేలియా ఈసారి సిరీస్ విజేతగా నిలిచింది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించినట్లే. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు