ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఏపీ లోని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హామీల అమలు గురించి అధికార పక్షంపై ప్రశ్నలు సంధించారు. ఇక జగన్ చేసిన విమర్శలను అధికార వర్గం తిప్పికొడుతోంది. తాజాగా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ సొంత తల్లికి దండం పెట్టని నువ్వు, తల్లికి వందనంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని జగన్ పై మండిపడ్డారు. నీ లాగా నీకు రూ.250, నీకు రూ.250, నీకు రూ.250, అని ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్ళకుండా, ఒకేసారి రూ.1000 పెంచి, పెన్షన్ 4 వేలు చేసామని వివరించారు . హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పధకం అమలు చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. అధికారం పోయిందనే బాధ జగన్ లో ఉందని అర్ధమవుతుందని దుయ్యబట్టారు. ప్రతి దానికి బయటపడిపోయి ఏడవకుండా, ప్రజలకు మంచి జరిగే విషయాల్లో అయినా మౌనంగా ఉండాలని సూచించారు. అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేసే విధంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
Previous Articleసిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా విజయం:3-1 తో సిరీస్ కైవసం
Next Article ఆకట్టుకునేలా డాకు మహారాజ్ ట్రైలర్…!