పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడు సంవత్సరాల తరువాత వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందజేసింది. పునరావాసం నిమిత్తం రూ.586.71 కోట్లు, భూ సేకరణకు రూ.235.23 కోట్లు, నిర్మాణ పనులకు రూ.174.53 కోట్లు సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో ఈ రెండు రోజుల్లోనే జమచేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వీరి పిటీషన్లను కొట్టివేసింది. ఇప్పటి వరకు ఈకేసులో 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు.
ఈడీ విచారణకు హాజరైన వైసీపీ నేత విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు సెజ్ కు సంబంధించిన కేసులో ఈడీ విచారణకు నేడు బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.