ఢిల్లీ మొత్తం ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీలో తో పాటుగా తమిళనాడు & యూపి ఉప ఎన్నికలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి,తమిళనాడులో ఖాళీగా ఉన్న ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి కూడా ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుందని భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు.