పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 10 వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. టికెట్లు,టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట అని స్పష్టం చేశారు. సీఎం అదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు… ఆపలేరని అన్నారు. అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరారు. 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేశారు. HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Previous Articleమీరు మోడీ కోసం చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article జనాభా తగ్గుదలపై మస్క్ ఆందోళన