వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. రేపు ఉదయం 5 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం ఈరోజు సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, అదనపు పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు