భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 2024 ఆగస్టులో జరిగిన రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో స్వదేశాన్ని వీడి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో మరణించిన వారి వారసులకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరుద్యోగులు నిరసనలు చేశారు.
బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలలో 2024 జులై, ఆగస్టు నెలల్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు కట్టడి చేయలేక ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్ కు వచ్చారు. అనంతరం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వ హయంలో బంగ్లాదేశ్ లోని మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం వీటిని అరికట్టలేకపోతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు