భారతదేశ అభివృద్ధికి ప్రవాసీ భారతీయిలు చేస్తున్న సహకారాన్ని గుర్తించాలనే ఉద్దేశ్యంతో 2003 నుండి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం విదేశీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 1915, జనవరి 9న భారత జాతిపిత మహాత్మా గాంధీ సౌతాఫ్రికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. దానిని పురస్కరించుకుని ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవడానికి ఈ రోజును ఎంచుకున్నారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయుల విజయ ప్రస్థానం ప్రపంచం ముందు ఉండడంతోపాటు వారి శ్రమను ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఇక నేడు 18 వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిస్సా లో నిర్వహించారు. ఎల్ఎం సింఘ్వీ నేతృత్వంలోని భారతీయ ప్రవాసులపై ఉన్నత స్థాయి కమిటీ జారీ చేసిన సిఫార్సుల మేరకు ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి ప్రధాని అటల్ బీహార్ వాజపేయి ప్రకటన తర్వాత ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవాలని సంకల్పించారు.
ఇక ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక టూరిస్ట్ రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ ప్రయాణాన్ని నరేంద్ర మోడీ ఈరోజు భువనేశ్వర్‌లో జెండా ఊపి ప్రారంభించారు.ఒడిస్సా లోని భువనేశ్వర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు . ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని వారి విజయాలు మనకు గర్వకారణమని పేర్కొన్నారు. కలిసి మనం భారతదేశాన్ని, భారతీయతను, మన మూలాలకు అనుసంధానం చేసుకుందామని పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి, మాఘ బిహు పండుగ కూడా రాబోతోంది. ప్రతిచోటా సంతోషకరమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్‌లో ఎగ్జిబిషన్‌ను మోడీ ప్రారంభించారు.
వారి విజయాలు మనకు గర్వకారణం:ప్రవాసీ భారతీయ దివాస్ లో ప్రధాని మోడీ
By admin1 Min Read