మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయం హుండీలో ఐఫోన్ జారిపడగా…యజమాని దానిని వేలం పాడి సొంతం చేసుకున్నాడు.తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.చెన్నై అంబత్తూరు వినాయకపురానికి చెందిన దినేష్ రెండు నెలల క్రితం ఆ ఆలయానికి వెళ్ళాడు.హుండీలో కానుక వేస్తుండగా అతడి జేబులోని ఐఫోన్ జారిపడింది.ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు.కానీ ఫలితం లేకపోయింది.హుండీలో పడిన కానుకలన్నీ దేవుడికే సొంతమని చెప్పారు.ఈ విషయాన్ని ఆయన దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు దృష్టికి వెళ్ళాడు.చివరకు హుండీలో పడిన వస్తువులను వేలం వేయాలనే ఆలయ నిబంధన ప్రకారమే దినేష్ ఐఫోన్ ఆలయ నిర్వాహకులు వేలం పాడారు.దినేష్ ఆ వేలంపాటలో పాల్గొని రూ.10వేలకు తన ఐఫోన్‌ని తిరిగి దక్కించుకున్నాడు
Previous Articleబాధపడిన సందర్భాలు ఉన్నాయి: నిధి అగర్వాల్
Next Article డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ విడుదల…!

