భారత పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కెరీర్ ఆసాంతం గాయాలతో బాధపడిన 35 ఏళ్ల ఈ జార్ఖండ్ బౌలర్ విజయ్ హజారే ట్రోఫీతో వీడ్కోలు పలికాడు.వేగంగా బౌలింగ్ చేయాలనే లక్ష్యమే ఈ 20 ఏళ్లు నన్ను నడిపించింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నా. అందరికి కృతజ్ఞతలని ఆరోన్ పేర్కొన్నాడు. 2010-11 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారానే వెలుగులోకి వచ్చిన ఆరోన్ జార్ఖండ్ కు ఆడుతూ గుజరాత్ తో జరిగిన ఫైనల్లో గంటకు 153 కి.మీ వేగంతో బంతి వేసి అందరి దృష్టిలో పడ్డాడు. 2011లో ఇంగ్లాండ్ తో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్ పై మొదటి టెస్టు కూడా ఆడాడు. చివరిగా 2015లో సౌతాఫ్రికా పై టెస్టు, శ్రీలంకపై 2014లో ఆఖరి వన్డే ఆడాడు. అతడు 9 టెస్టులు వన్డేల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో18 వికెట్లు, వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్లకు ఆడిన ఈ పేసర్.. 52 మ్యాచ్లో 44 వికెట్లు పడగొట్టాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు