దేశ రాజధాని ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.ఢిల్లీ ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనుండటంతో ఆ పార్టీ ప్రచారాన్ని ఉదృతం చేసింది.నిరుద్యోగులకు యవ ఉడాన్ యోజన కింద రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. ఇది ఉచితంగా ఇచ్చే మొత్తం కాదని వెల్లడించింది. ఆ పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘‘ఏదైనా కంపెనీ లేదా ఫ్యాక్టరీలో తమకు ఉన్న నైపుణ్యాలను చూపించిన యువతకు ఆర్థిక సాయం చేస్తాం. వారు ఈ కంపెనీల నుంచి ఆ సొమ్మును పొందుతారు. ఇది ఇళ్లల్లో ఖాళీగా కూర్చొనేవారికి ఉచితంగా సొమ్ములు ఇచ్చే పథకం కాదు. ప్రజలు శిక్షణపొందిన రంగాల్లో స్థిరపడేలా సాయం చేయడానికే ఈ పథకం తెచ్చాము’’ అని పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు డబ్బులు…కాకపోతే కండిషన్ : కాంగ్రెస్ ప్రకటన
By admin1 Min Read
Previous Articleఢిల్లీ ఎన్నికలు.. క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించిన సీఎం
Next Article త్వరలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ: సీఎం చంద్రబాబు

