పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం, ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను లోగిళ్లకు మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలనీ ఆకాంక్షించారు.
రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సరదాల సక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయని ఇది ప్రజలకు ఈ పండుగపై ఉన్న మక్కువను తెలియచేస్తుందని పేర్కొన్నారు . ఉపాధికోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి.. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం: ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ సంక్రాంతి శుభాకాంక్షలు
By admin1 Min Read
Previous Articleనష్టాలతో ముగిసిన సూచీలు:77 వేల దిగువకు సెన్సెక్స్
Next Article ఆస్ట్రేలియన్ ఓపెన్: రెండో రౌండ్ లో జకోవిచ్