మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తెలుగు వారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగినదని అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో పలు సాంస్కృతిక పూజా కార్యక్రమాలలో కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleఘనంగా ప్రారంభమైన ఖోఖో ప్రపంచకప్
Next Article మిస్సైల్ నాగ్ మార్క్-2 పరీక్ష విజయవంతం