స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా డిసెంబర్ 31న రెండు శాటిలైట్ లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు శాటిలైట్ ల డాకింగ్ పూర్తయింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని తెలిపింది. విజయవంతంగా స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించిందని వెల్లడించింది. మొత్తం బృందానికి భారతదేశానికి అభినందనలు! అంటూ ఇస్రో పేర్కొంది.
Previous Articleసైఫ్అలీఖాన్ పై కత్తి దాడి…!
Next Article దబిడి దిబిడిపై నెగెటివిటీ.. స్పందించిన ఊర్వశీ రౌతేలా