ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ లో భారత స్టార్ షట్లర్ సింధు 21-14, 22-20తో చైనీస్ తైపీకి చెందిన యున్ సుంగ్ పై విజయం సాధించి శుభారంభం చేసింది. మరో మ్యాచ్లో అనుపమ ఉపాధ్యాయ 21-17, 21-18తో రక్షితశ్రీపై గెలిచింది. ఆకర్షి కశ్యప్ 17-21, 13-21తో థాయ్ ల్యాండ్ కు చెందిన పోర్న్ పావీ చేతిలో పరాజయం చెందింది. మాళవిక బాన్సోద్ 22-20, 16-21, 11- 21తో చైనాకు చెందిన యూ హాన్ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ లో హెచ్.ఎస్. ప్రణయ్ మొదటి రౌండ్ లో 21-16, 18-21, 12-21తో చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ చేతిలో ఓటమి చెందాడు.
పురుషుల డబుల్స్ లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ముందంజ వేసింది. తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్ జోడీ 23-21, 19-21, 21-16తో మలేషియా జోడీ వీ చాంగ్- కాయ్ వున్ పై విజయం సాధించింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్పప్ప- తనీషా క్రాస్టో 21-11, 21-12తో కావ్య గుప్తా- రాధిక శర్మపై, శిఖ గౌతమ్- అశ్విని భట్ 22-20, 21-18తో కెనడాకు చెందిన జాకీ డెంట్- క్రిస్టల్ లాయ్ పై, రుతపర్ణ పాండా- శ్వేతపర్ణ పాండా 7-21, 21-19, 21-14తో థాయ్ లాండ్ కు చెందిన ఫథరిన్- జాన్పెంగ్ పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు. అయిదో సీడ్ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ 21-23, 19-21తో జపాన్ కు చెందిన అరిసా ఇగరషి- అయాకో సకురమోటో జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డ్ డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో జోడీ 8-21, 21-19, 21-17తో చైనీస్ తైపీ జోడీ చెంగ్ క్వాన్- యిన్ సు పై గెలిచింది.
ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీ: భారత స్టార్ షట్లర్ సింధు ముందంజ
By admin1 Min Read
Previous Articleదబిడి దిబిడిపై నెగెటివిటీ.. స్పందించిన ఊర్వశీ రౌతేలా
Next Article విజయ్ హజారే టోర్నీలో ఫైనల్ చేరిన కర్ణాటక