గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేఛ్చ కూడా లేని పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రానికి రావాలన్నా నాటి ప్రభుత్వ విధానాలకు భయపడే పరిస్థితి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన వారిని, నాడు తరిమేసిన చరిత్ర కూడా చూసామని అన్నారు. సచివాలయంలో ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర వృద్ధిరేటుపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రూ.2.68లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి రూ.58.14 లక్షలు అవుతుందన్నారు. ఏపీకి పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని దుయ్యబట్టారు. సంపద సృష్టించి ప్రజల ఆదాయం పెంచుతామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి జరిగి సంపద పెరిగి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. దీంతో పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. మౌలిక సదుపాయాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చిన విషయాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమించాలన్నారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాలి. ధనికులు తమ శక్తి సామర్ధ్యాల మేరకు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఆర్థికంగా పైకి తేవడానికి పబ్లిక్-ప్రైవేట్- పీపుల్- పార్టనర్షిప్ పీ-4 అదే విధంగా సంపద సృష్టిలో పీ-3పబ్లిక్-ప్రైవేట్- పార్టనర్షిప్ గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు.
2047 నాటికి రాష్ట్రాన్ని 2.4ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
By admin1 Min Read