భారత్‌లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ప్రభుత్వం ఓడిపోయిందంటూ తమ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా ఇండియా క్షమాపణ తెలిపింది.అది అనుకోకుండా జరిగిన పొరపాటని పేర్కొంది.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ…2024లో జరిగిన ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో సిట్టింగ్ ప్రభుత్వాలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. ‘‘అది ద్రవ్యోల్బణం వల్ల కావొచ్చు. లేదా కొవిడ్‌ను ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్ల కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించింది’’ అని పేర్కొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా పలు దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. జుకర్‌బర్గ్ నుంచి ఇలాంటి అసత్య సమాచారం రావడం నిరాశకు గురిచేసింది. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందాం’’ అని వైష్ణవ్ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు