కెరీర్ పరంగా ఇటీవల రజనీకాంత్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది.ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది.తాజాగా సంక్రాంతికి కానుకగా `జైలర్ 2`ని ప్రకటించారు.సన్ పిక్చర్స్ సంస్థ పొంగల్ పండుగ సందర్భంగా జైలర్ 2 సినిమా పై అధికారిక ప్రకటన విడుదల చేసింది.అనిరుధ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరూ ఫెంగ్ తుఫాను గురించి మాట్లాడుకుంటున్నారు.అప్పుడు నెల్సన్‌ను చెన్నైకి తిరిగి వెళ్దామా అని అనిరుధ్ అడగగా,తుఫాను చెన్నైలోనే ఉంది.అందుకే కథ గురించి చర్చించడానికి మిమ్మల్ని గోవాకు తీసుకొచ్చాను అని నెల్సన్ అంటాడు.నా సినిమా వచ్చాక 5 తుఫానులు వచ్చిపోయాయి.మీరు వారానికో సినిమా విడుదల చేస్తున్నారు.అకస్మాత్తుగా ఇంటికి కిటికీలన్నీ పగలగొట్టుకుని రౌడీలు వచ్చి పడుతున్నారు’ అని అనిరుధ్ అంటాడు.నెల్సన్, అనిరుధ్ ఇద్దరూ భయంతో కేకలు వేస్తూ లేస్తారు.రజినీకాంత్ కత్తితో ఇంట్లోకి రావడంతో,నెల్సన్,అనిరుధ్ ఇద్దరూ బెడ్ షీట్ కప్పుకుంటారు.
Previous Articleముంబయి సేఫ్ కాదనడం కరెక్ట్ కాదు : సీఎం దేవేంద్ర ఫడణవీస్
Next Article విశ్వక్ సేన్ లైలా టీజర్ ఎప్పుడంటే..?