ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుండి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె సాధించిన ఘనత పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అవడం డిస్టింక్షన్లో పాసై తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అని దీవిస్తూ భార్య భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, జగన్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన సతీమణి భారతి రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన మాజీ సీఎం జగన్ కుమార్తె
By admin1 Min Read