ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం పై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆమె తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.
అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప బాబు గారి పనితనం శూన్యమని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అని హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి. నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యమని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం అప్పుల్లో ఉందని: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleరూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
Next Article ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సాంగ్ రిలీజ్