65 లక్షల కుటుంబాలకు పైగా నేడు ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో స్వామిత్వా (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ) పధకం కింద ఆస్తి కార్డుల పంపిణీ చేశారు. దేశంలోని 10 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 230 జిల్లాలలోని లబ్దిదారులు ఈ కార్డులు అందుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. లబ్దిదారులకు అభినందనలు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించి 1.5 కోట్ల మందికి స్వామిత్రా కార్డులు పంపిణీ చేసినట్లు వివరించారు. నేడు మరో 65 లక్షల కుటుంబాలు ఈ కార్డులు పొందాయని తెలిపారు. గ్రామాల్లోని 2.25 కోట్ల మంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులు పొందారని పేర్కొన్నారు.
65 లక్షల కుటుంబాలకు వర్చువల్ పద్ధతిలో ‘స్వామిత్వా’ ఆస్తి కార్డులు అందించిన ప్రధాని మోడీ
By admin1 Min Read