చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలనే ఇద్దరు ఉపాధ్యాయులు తమ అసభ్య కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు.రాజస్థాన్ లోని చిత్తోర్ఢ్ లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలితో ఓ ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరి పైనా సస్పెన్షన్ వేటు విధించారు.పాఠశాల స్టాఫ్ రూమ్ లో కొద్ది రోజులుగా సాగుతోన్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం అత్యంత ఇబ్బందికరంగా ఉన్న వీడియో దృశ్యాలు తమ దృష్టికి రావడంతో డీఈవో తక్షణమే వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.పాఠశాలలో టీచరమ్మతో ఉపాధ్యాయుడి రాసలీలల వ్యవహారం వెలుగు చూడటంతో గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు.వీరిద్దరి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Previous Articleపెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
Next Article ఆ రాష్ట్రంలో మెట్రో ఛార్జీల పెంపు