ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ లో ఆడి తద్వారా మునుపటి ఫాం లోకి రావడానికి సమాయత్తం అవుతున్నారు. ఫిట్ నెస్ సమస్యలు ఉంటే తప్ప కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఇక దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీకి విరాట్ ముంబయికి రోహిత్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దశాబ్దానికి పైగా సమయం తర్వాత విరాట్ ఈ టోర్నీలో ఆడబోతున్నాడు. తాను సెలక్షన్ కు అందుబాటులో ఉంటున్నట్లు అతడు దిల్లీ క్రికెట్ సంఘానికి తాజాగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే మెడనొప్పి కారణంగా ఈనెల 23న సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడే మ్యాచ్ కు కోహ్లి ఆడట్లేదు. జనవరి 30న రైల్వేస్తో పోరులో అతడు బరిలో దిగే అవకాశాలున్నాయి. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ కూడా ఆడుతున్నాడు. మరోవైపు ఈనెల 23న జమ్ము కాశ్మీర్లో మొదలయ్యే మ్యాచ్లో ఆడే ముంబయి జట్టుకు రోహితశర్మ ఎంపికయ్యాడు. అతనితో పాటు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ముంబయి సారధిగా అజింక్య రహానె కొనసాగుతాడు. రోహిత్, యశస్విలు ముంబయి ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొంటున్నారు.
Previous Articleఎమర్జెన్సీ పై ఆ రాష్ట్రంలో బ్యాన్.. బాధగా ఉందన్న కంగన
Next Article లక్నో సూపర్ జెయింట్స్ సారధిగా రిషబ్ పంత్