అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్స్ సంస్థ డి.హెచ్.ఎల్ గ్లోబల్ సీఈఓ పాబ్లో సియానోతో దావోస్ బెల్వేడేర్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారత్ కార్గో ట్రాఫిక్ లో 16.5శాతం వాటా కలిగి ఏపీ 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి కీలక ఓడరేవులు, ఇండస్ట్రియల్ హబ్ లు, వేర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజిలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటుచేయాలని కోరారు. ఏపీలో లాజిస్టిక్ కార్యకలాపాలను మెరుగుపర్చేందుకు బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే అయిదేళ్లలో లాజిస్టిక్స్ పై 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు పాబ్లో సియానో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్ మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్ విడిసి వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పునఃపరిశీలించి… వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టమ్‌లను హిటాచీ అభివృద్ధి చేస్తోందని ఈ సందర్భంగా భరత్ కౌశల్ మంత్రి లోకేష్ కు వివరించారు.
ఫ్రెంచి సాఫ్ట్ వేర్ సంస్థ దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్ తో కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్ స్టర్ తో కూడా లోకేష్ సమావేశమై చర్చించారు.
అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ప్రమోషన్: ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు
By admin1 Min Read