జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ కార్యక్రమంలో కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. తాజాగా నేడు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ సహా పలువురు మంత్రులు త్రివేణీ సంగమం వద్ద మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి సీఎం యోగి ప్రత్యేక హారతులు ఇచ్చారు. 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మహా వేడుక ద్వారా12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుండి కోటి మంది పుణ్యస్నానాలు చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే తెలిపారు.

Previous Articleమధ్యతరగతి కోసం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’: మిడిల్ క్లాస్ మ్యానిఫెస్టో
Next Article నేటి ట్రేడింగ్ లో లాభాల బాటలో సూచీలు..!

