నేటి ట్రేడింగ్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. రోజంతా ఒక మోస్తరుగా కదలాడిన సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో నిన్నటి నష్టాల నుండి కొంతమేర కోలుకుని లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76,404 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.33గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleమహా కుంభమేళాలో స్నానమాచరించిన యూపీ సీఎం యోగి ఆదిత్య నాధ్
Next Article ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం..

