ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది.జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 40కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అంచనా.ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతోంది.తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది.
ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఆ దృశ్యాల్లో కనిపించింది. 2024 ఏప్రిల్ 6వ తేదీ ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్ కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్‌లా అది కనిపించింది. ఇదిలా ఉంటే.. 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది పుణ్యస్నానాలు చేసేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు.
Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ
— ISRO InSight (@ISROSight) January 22, 2025

