యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రాధాన్యతని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోందని పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించినట్లు వెల్లడించారు. ఉపాధి ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ‘మిడిల్ క్లాస్ మ్యానిఫెస్టో’ పేరిట ఇటీవలే కేజ్రీవాల్ తమ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు.
ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
By admin1 Min Read
Previous Articleముడి జనపనారకు కనీస మద్దతు ధర పెంపు
Next Article ఐటీ సోదాలపై అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు

