అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న డ్రగ్ కార్టల్స్‌ను విదేశీ ఉగ్ర సంస్థలుగా అభివర్ణించారు. హౌతీ రెబల్స్‌ను కూడా తీవ్రవాద గ్రూపుగా ట్రంప్ తెలిపారు.
దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని, వేల వేల సంఖ్యలో హంతకులు కూడా ఉన్నారని, వారందర్నీ అణిచివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం 11 వేల మంది హంతకులు జీవిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో జైళ్లలో ఉన్న వారు అమెరికాకు వచ్చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో క్రైం రేటు 78 శాతం తగ్గినట్లు ట్రంప్ చెప్పారు. విదేశాల్లోని వీధి గ్యాంగ్‌లు ఇప్పుడు అమెరికాకు వచ్చేశాయని, ఆ ముఠాల ఆగడాలను కొలరాడో, లాస్ ఏంజిల్స్‌లో చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు