ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.ప్రతిచోటా అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయన తరఫున మరో లాయర్ అశ్వినీ దూబే ఈ వ్యాజ్యాన్ని వేశారు. టీడీఎస్ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఎలాగైనా దీన్ని రద్దు చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ వ్యాజ్యాన్ని తాము విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. టీడీఎస్ విధానం అన్ని దేశాల్లోనూ అమలవుతోందని గుర్తు చేసింది. కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.
టీడీఎస్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్.. ధర్మాసనం ఏమందంటే
By admin1 Min Read
Previous Articleప్రతి దాన్ని చివరిదిగా భావించే దశలో ఉన్నా: సమంత
Next Article యశ్ చిత్రంలో నయనతార