ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోడీ మధ్య జరిగిన సమావేశంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఇండోనేషియా నిర్ణయించాయి. సుబియాంతో మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చారు. రేపు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాగా, ఇరువురి నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించారు. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం ఉపయోగపడేలా ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. భారత్ కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని మోడీ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్లు మోదీ వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్, ఇండోనేషియా కలిసి పని చేయబోతున్నట్లు తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ఇరుదేశాలు పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంతో అన్నారు. ఫిస్టిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Previous Articleరాజ్యసభ ఛైర్మన్ కు రాజీనామా సమర్పించిన విజయసాయిరెడ్డి
Next Article సన్యాసం తీసుకున్న హీరోయిన్ మమతా కులకర్ణి