రాజకీయాల్లోకి వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న తెలిపిన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసి తన రాజీనామా సమర్పించారు.
వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ రాజీనామా లేఖ సమర్పించినట్లు దాన్ని ఆయన ఆమోదించారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా మాత్రమే కాదు.. రాజకీయాల నుండి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.వైసీపికి 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. నా రాజీనామాతో కూటమీ లబ్ధి పొందుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక జగన్ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఏపీ సీఎం చంద్రబాబుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు.
Previous Articleనేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
Next Article భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం