అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంకల్ప పత్ర’ పార్ట్-3 పేరుతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. కేంద్రమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు ఉండవన్నారు. 50 వేల ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని . బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని వివరించారు.
ఢిల్లీకి చేసిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదని ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం అందించలేదని దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదని ఆక్షేపించారు. ఎన్నడూ లేని విధంగా కేజీవాల్ నేతృత్వంలో అవినీతి మరింతగా పెరిగిపోయిందని అమిత్ షా మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ.15 వేల కోట్లు, ఎయిర్పోర్టుకు రూ. 21 వేల కోట్లను అందించినట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తామని స్పష్టం చేశారు. . రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు