రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.





