భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు చెన్నై వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 45 (30; 2×4, 3×6) టాప్ స్కోరర్. బ్రిడన్ కార్సే 31 (17; 1×4, 3×6), స్మిత్ 22 (12; 1×4, 2×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, హార్థిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ కూడా తడబడింది. అయితే తిలక్ వర్మ 72 నాటౌట్ (55; 4×4, 5×6) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్లు పడుతున్నా తనదైనశైలిలో ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. వాషింగ్టన్ సుందర్ 26 (19; 3×4, 1×6) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రిడన్ కార్సే 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అదిల్ రషీద్, జేమీ ఓవర్టన్, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు