భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఈ సంవత్సరం ఏడాది జరిగే రెండో ఎడిషన్ ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్)లో భారత జట్టు తరపున ఆడేందుకు సంతకం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి గతేడాది వైదొలగిన 39 ఏళ్ల డ్యాషింగ్ బ్యాటర్ తిరిగి వస్తుండడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాషింగ్ బ్యాటర్ గా పేరున్న శిఖర్ ధవన్ తన కెరియర్ లో మొత్తం 164 వన్డే మ్యాచ్ లలో 44 యావరేజ్, 91.35 స్ట్రైక్ రేట్ తో 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 143 పరుగులు. అలాగే, టెస్టుల్లో 58 ఇన్నింగ్స్లో 40.61 యావరేజ్, 67 స్ట్రైక్ రేట్ తో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 190 పరుగులు. ఇక, టీ20ల్లో 66 ఇన్నింగ్స్ లలో 126.36 స్ట్రైక్ రేట్ తో 1,759 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 పరుగులు. ధవన్ ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్ ఆడి 6,769 పరుగులు సాధించాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

