ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది.పెద్దఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు,జోర్డాన్‌లు పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
గాజా ప్రాంతం శిథిలాల కుప్పగా మారింది.అక్కడున్న ప్రతీది నాశనమైంది.ప్రజలు చనిపోతున్నారు.ఈ క్రమంలోనే వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలతో కలిసి వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నా.అక్కడ వారు శాంతియుతంగా జీవించవచ్చు.ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు..లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈజిప్టు అధ్యక్షుడితోనూ దీనిపై చర్చిస్తానని తెలిపారు.ఈజిప్టు, జోర్డాన్‌లు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.